శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.
నీవే తల్లి వి దండ్రి వి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.
నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా.
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా.
క్రూరాత్ముఁ డజామీళుఁడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు వెందును కృష్ణా.
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటివేల్పు వెందును కృష్ణా.
చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా.
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా.
అక్రూరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా
శక్రాదిదివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్ణా.
చక్రాయుధ ఖడ్గపాణిశౌరి ముకుందా
శక్రాదిదివిజసన్నుత
శుక్రార్చిత నన్ను కరణఁజూడుము కృష్ణా.
నందున ముద్దులపట్టివి
మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
పండితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణా.
మందరగిరి ధరుని హరుని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ
పండితు నిను దలఁతు భక్తవత్సల కృష్ణా.
ఓ కారుణ్యపయోనిధి
నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా.
నా కాధారంబ వగచు నయముగఁ బ్రోవ
న్నా కేల యితర చింతలు
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా.
వేదంబులు గననేరని
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగ కృష్ణా. 10
యాది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగ కృష్ణా. 10
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా.
కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా.
అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమగర్భమున బుట్టి యా దేవతకిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా.
నష్టమగర్భమున బుట్టి యా దేవతకిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా.
అల్ల జగన్నాథుకు వ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదము
తల్లి యునై చన్నుఁగుడిపె దనరగ కృష్ణా.
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదము
తల్లి యునై చన్నుఁగుడిపె దనరగ కృష్ణా.
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా.
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా.
హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున దత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా.
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున దత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా.
పాణితలంబున వెన్నయు
వేణీమూలబునందు వెలయఁపింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా.
వేణీమూలబునందు వెలయఁపింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా.
మడుగుకు జని కాశియుని
పడగలపై భతరశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలcతు నచ్యుత కృష్ణా.
పడగలపై భతరశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలcతు నచ్యుత కృష్ణా.
బృందావనమున బ్రహ్మ
నందార్భకమూర్తి వేణునాదము నీ వా
మందార మూలమున గో
విందాపూరింతువౌర వేడుక కృష్ణా.
నందార్భకమూర్తి వేణునాదము నీ వా
మందార మూలమున గో
విందాపూరింతువౌర వేడుక కృష్ణా.
వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడవచ్చిన నీవా
చీరలుమ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా.
వారిని జలకంబులాడవచ్చిన నీవా
చీరలుమ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా.
దేవేంద్రుcడలుకరోడను
వావిరిగా ఱాళ్ళవాన వడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా. 20
వావిరిగా ఱాళ్ళవాన వడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా. 20
అండజవాహన వినుబ్ర
హ్మండంబుల బంతులపట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డకొండా కృష్ణా.
హ్మండంబుల బంతులపట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డకొండా కృష్ణా.
అంసాలంబిత కుండల
కంసాంతక! నీవు ద్వారకపురిలోనన్
సంసారరీతి నుంటివి
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా.
కంసాంతక! నీవు ద్వారకపురిలోనన్
సంసారరీతి నుంటివి
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా.
పదియాఱువేల నూర్వురు
సుదతులు యెలమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా.
సుదతులు యెలమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా.
అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొస్రుcగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా.
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొస్రుcగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా.
హా వసుదేవ కుమారక
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా.
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా.
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకష మగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులజేయు ఘనుcడవు కృష్ణా.
అభ్రంకష మగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులజేయు ఘనుcడవు కృష్ణా.
జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవే తేరున
భయమున తివుసేన విఱిగి పాఱగ కృష్ణా.
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవే తేరున
భయమున తివుసేన విఱిగి పాఱగ కృష్ణా.
దుర్జనౌలగు నృపసంఘము
నిర్జింపcగదలcచి నూవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జునునకు నీవు సారధైతివి కృష్ణా.
నిర్జింపcగదలcచి నూవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జునునకు నీవు సారధైతివి కృష్ణా.
శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్మ జంపcగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా.
చక్రము చేపట్టి భీష్మ జంపcగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా.
దివిహేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు తఘురాముcడవై
దివిజేంద్రసుతుని గాంచియు
రవిసుతు బరిమార్చి తార రణమున కృష్ణా. 30
రవిసుతు రక్షించినావు తఘురాముcడవై
దివిజేంద్రసుతుని గాంచియు
రవిసుతు బరిమార్చి తార రణమున కృష్ణా. 30
దుర్భరబాణము రాcగా
గర్భములోనుండి యాభయ గావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
నర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.
గర్భములోనుండి యాభయ గావుమటన్నన్
నిర్భరకృప రక్షించితి
నర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.
గిరులందు మేతివౌదువ్
సురలందున నింద్రుcడౌదు చుక్కలలోలన్
బరమాత్మ చంద్రుcడౌదువు
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా.
సురలందున నింద్రుcడౌదు చుక్కలలోలన్
బరమాత్మ చంద్రుcడౌదువు
నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా.
చుక్కల నెన్నగచచ్చును
గ్రక్కున భూరేణువులను గణూతింతిపనగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా.
గ్రక్కున భూరేణువులను గణూతింతిపనగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా.
కుక్షిని సకల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయనీరధి నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షత పవళించునట్టి ధన్యుcడ కృష్ణా.
నిక్షేపము జేసి ప్రళయనీరధి నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షత పవళించునట్టి ధన్యుcడ కృష్ణా.
విశ్వోత్పత్తికి బ్రహ్మపు
విశ్వము రక్షంపcదలcచిన విష్ణుcడ వనcగ
విశ్వము జెరుపను హరుcడవు
విశ్వాత్మక నీవె యగుదు వెలయగ కృష్ణా.
విశ్వము రక్షంపcదలcచిన విష్ణుcడ వనcగ
విశ్వము జెరుపను హరుcడవు
విశ్వాత్మక నీవె యగుదు వెలయగ కృష్ణా.
అగణిత వైభవ కేశవ
నగధర వనమాలి యాదినారాయణ యో
భగవంతుcడ శ్రీమంతుంcడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా.
నగధర వనమాలి యాదినారాయణ యో
భగవంతుcడ శ్రీమంతుంcడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా.
మగమీనమవై జలధిని
పగతుని సోమకుని జంపి పద్మభవునకు
న్నిగమముల దెచ్చి యిచ్చితివి
సుగుణాకర! మేలు దివ్యసుందర కృష్ణా.
పగతుని సోమకుని జంపి పద్మభవునకు
న్నిగమముల దెచ్చి యిచ్చితివి
సుగుణాకర! మేలు దివ్యసుందర కృష్ణా.
అందఱు సురలును దనుజులు
పొందుగ క్షిరాబ్ది దఱవ పొలుపున నీ వా
నందముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా.
పొందుగ క్షిరాబ్ది దఱవ పొలుపున నీ వా
నందముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా.
ఆడివరాహూcడవయు నీ
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడcగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా.
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడcగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా.
విరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉదరము జీరి వధించితివి
నరహరి రూపావతార నగధర కృష్ణా. 40
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉదరము జీరి వధించితివి
నరహరి రూపావతార నగధర కృష్ణా. 40
వడుగుcడవై మూcడడుగుల
నడిగితివౌ భళిర భళిర, యభిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా.
నడిగితివౌ భళిర భళిర, యభిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా.
ఇరువ దొకమారు నృపతుల
శిరములు క్షండించితౌర చే గొడ్డంటన్
ధర గశ్య్వపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుcడ కృష్ణా.
శిరములు క్షండించితౌర చే గొడ్డంటన్
ధర గశ్య్వపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుcడ కృష్ణా.
దశకంకుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియున్న నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరధరామావతార ధన్యుడ కృష్ణా.
కుశలముతో సీత దెచ్చికొనియున్న నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరధరామావతార ధన్యుడ కృష్ణా.
ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ? రేవతీపతి
యనcగ జలరామమూర్తి వైతివి కృష్ణా.
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ? రేవతీపతి
యనcగ జలరామమూర్తి వైతివి కృష్ణా.
త్రిపురాసుర భార్యల సతి
నిపుణతతో వ్రతముచేత నిలిపిన కీర్తుల్
కపటపు రాజపు భళిరే
కృపగల బౌద్దావతార ఘన్cడవు కృష్ణా.
నిపుణతతో వ్రతముచేత నిలిపిన కీర్తుల్
కపటపు రాజపు భళిరే
కృపగల బౌద్దావతార ఘన్cడవు కృష్ణా.
వలపులతేజీ నెజ్జియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగముతుదీ వేడుక
కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా.
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగముతుదీ వేడుక
కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా.
వనజాక్షి భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
మను నీ సద్గుణజాలము
ననకాది మునీంద్రు లెన్నజాలకు కృష్ణా.
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
మను నీ సద్గుణజాలము
ననకాది మునీంద్రు లెన్నజాలకు కృష్ణా.
అపరాధసహస్రంబుల
నపరిమితములైన యఘము లనిశము నేనుం
గపటాత్ముcడనై జేసితి
చపలుని ననుగావు శేషశాయివి కృష్ణా.
నపరిమితములైన యఘము లనిశము నేనుం
గపటాత్ముcడనై జేసితి
చపలుని ననుగావు శేషశాయివి కృష్ణా.
నరపశువు మూఢచిత్తుcడ
దురితారంభుcడను మిగుల దోషగుcడను నీ
గుఱుతెఱుcగ నెంతవాcడబు
హరి నీవే ప్రాపుదాపు నౌదువు కృష్ణా.
దురితారంభుcడను మిగుల దోషగుcడను నీ
గుఱుతెఱుcగ నెంతవాcడబు
హరి నీవే ప్రాపుదాపు నౌదువు కృష్ణా.
పరనారి ముఖపద్మము
గుఱుతగు కుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నిరతము నిను భక్తిగొల్వ నేరదు కృష్ణా. 50
గుఱుతగు కుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు
నిరతము నిను భక్తిగొల్వ నేరదు కృష్ణా. 50
పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్దిని చరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెరిగినాcడ నిప్పుడె కృష్ణా.
కొంచెపు బుద్దిని చరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెరిగినాcడ నిప్పుడె కృష్ణా.
దుష్టుండ ననాచారుcడ
దుష్టచరిత్రుcడను చాల దుర్భుద్దిని నే
నిష్ట నిను గొల్వనేరని
కష్టుంcడ నను గావు కావు కరుణను కృష్ణా.
దుష్టచరిత్రుcడను చాల దుర్భుద్దిని నే
నిష్ట నిను గొల్వనేరని
కష్టుంcడ నను గావు కావు కరుణను కృష్ణా.
కుంభీంద్రవరద కేశవ
జంభాసురవైరి డివిజసన్నుత చరితా
అంభోజనేత్ర జలనిధి
గంభీరా నన్ను గావు కరుణను కృష్ణా.
జంభాసురవైరి డివిజసన్నుత చరితా
అంభోజనేత్ర జలనిధి
గంభీరా నన్ను గావు కరుణను కృష్ణా.
దిక్కెవ్వరు ప్రహ్లాదుడు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడు
న్దిక్కెవ్వర య్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కవు కృష్ణా.
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడు
న్దిక్కెవ్వర య్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కవు కృష్ణా.
హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయం
బరమేష్టి సురలు బొగడcగ
కరిగాంచినరీతి నన్ను గాపుము కృష్ణా.
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయం
బరమేష్టి సురలు బొగడcగ
కరిగాంచినరీతి నన్ను గాపుము కృష్ణా.
పురుషోత్తమ లక్ష్మీపతి
సరసిజ గర్భాదిమౌని సన్నుత చరితా
మురభంజన సుర రంజన
వరదుcడవగు నాకు భక్తవత్సల కృష్ణా.
సరసిజ గర్భాదిమౌని సన్నుత చరితా
మురభంజన సుర రంజన
వరదుcడవగు నాకు భక్తవత్సల కృష్ణా.
క్రతువులు తీర్ధాగమములు
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి! మిము దలcచినవారికి
సతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా.
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి! మిము దలcచినవారికి
సతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా.
స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించునట్టి రీతిని వెలయన్
అంభోజనేత్ర జలనిధి
గంభీరుcడ నన్నుగావు కరుణను కృష్ణా.
డింభకు రక్షించునట్టి రీతిని వెలయన్
అంభోజనేత్ర జలనిధి
గంభీరుcడ నన్నుగావు కరుణను కృష్ణా.
శతకోటి భాను తేజా
యతులిత సద్గుణగణాధ్య యంబుజనాభా
రతినాధజనక లక్ష్మీ
పతిహిత ననుగావు భక్త సన్నుత కృష్ణా.
యతులిత సద్గుణగణాధ్య యంబుజనాభా
రతినాధజనక లక్ష్మీ
పతిహిత ననుగావు భక్త సన్నుత కృష్ణా.
మందుcడ నీ దురితాత్ముcడ
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నును
సందేహింపక కావుము
నందునివరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా. 60
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నును
సందేహింపక కావుము
నందునివరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా. 60
గజరాజ వరదే కేశవ
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ
భుజగేంద్ర శయన మాధవ
విజయాప్తుcడ నన్ను గావు వేగమె కృష్ణా.
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ
భుజగేంద్ర శయన మాధవ
విజయాప్తుcడ నన్ను గావు వేగమె కృష్ణా.
గోపాల దొంగ మురహర
పాపాలను పాఱcద్రోలు ప్రభుcడవు నీవే
గోపాలమూర్తి దయతో
నాపాలిట గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా.
పాపాలను పాఱcద్రోలు ప్రభుcడవు నీవే
గోపాలమూర్తి దయతో
నాపాలిట గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా.
దుర్మతిని మిగుల దుష్టపు
కర్మంబులు జేసినట్టి కష్టుcడ నన్ను న్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముcడ నిను నమ్మినాను నిజముగ కృష్ణా.
కర్మంబులు జేసినట్టి కష్టుcడ నన్ను న్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముcడ నిను నమ్మినాను నిజముగ కృష్ణా.
దుర్వార చక్రధరకర
శర్వాణీభర్తృవినుత జగదాధారా
నిర్వాణనాధ మాధవ
సర్వాత్మక నన్ను గావు సరగున కృష్ణా.
శర్వాణీభర్తృవినుత జగదాధారా
నిర్వాణనాధ మాధవ
సర్వాత్మక నన్ను గావు సరగున కృష్ణా.
సుత్రామనుత జనార్థన
సత్రాజిత్త నయనాధ సౌందర్యకళా
చిత్రాపతార దేవకి
పుత్రా ననుగావు నీకు పుణ్యము కృష్ణా.
సత్రాజిత్త నయనాధ సౌందర్యకళా
చిత్రాపతార దేవకి
పుత్రా ననుగావు నీకు పుణ్యము కృష్ణా.
బలమెవ్వcడు కరి బ్రోవను
బలమెవ్వcడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వcడు సుగ్రీవుకు
బలమెవ్వcడు నాకు నీవె బలమౌ కృష్ణా.
బలమెవ్వcడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వcడు సుగ్రీవుకు
బలమెవ్వcడు నాకు నీవె బలమౌ కృష్ణా.
పరుసము సోకిన యినుమును
పరుసగ బంగారమైన పడుపున జిహ్వాన్
హరి నీ నామము సోకిన
సురపందిత నేను నటుల సులభుcడ కృష్ణా.
పరుసగ బంగారమైన పడుపున జిహ్వాన్
హరి నీ నామము సోకిన
సురపందిత నేను నటుల సులభుcడ కృష్ణా.
ఒకసారి నీదునామము
ప్రకటముగా దలcచువారి పాపము లెల్లన్
వికలములై దొలcగుటకును
సకలార్థ యజామిళుండు సాక్షియో కృష్ణా.
ప్రకటముగా దలcచువారి పాపము లెల్లన్
వికలములై దొలcగుటకును
సకలార్థ యజామిళుండు సాక్షియో కృష్ణా.
హరి సర్వంబున గలcడని
గరిమను దైత్యుండు బలుక కంబములోనన్
యిరవొంది వెడలి చీల్చవే
శరణను ప్రహ్లాదుcడిందు సాక్షియె కృష్ణా.
గరిమను దైత్యుండు బలుక కంబములోనన్
యిరవొంది వెడలి చీల్చవే
శరణను ప్రహ్లాదుcడిందు సాక్షియె కృష్ణా.
భద్రార్చిత శుభచరణ సు
భద్రాగ్రజ సర్వలోకపాలన హరి! శ్రీ
భద్రాద్రిప కేశవ బల
భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా. 70
భద్రాగ్రజ సర్వలోకపాలన హరి! శ్రీ
భద్రాద్రిప కేశవ బల
భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా. 70
ఎటువలె కరిమొఱ వింటివి
ఎటువలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాcడc గావుము కృష్ణా.
ఎటువలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాcడc గావుము కృష్ణా.
తట తట లేటికి జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణున్
ఎటువలె నిపుణుని జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణున్
ఎటువలె నిపుణుని జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.
తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేఱెపదవి పుట్టుటయేమో
హరి మిము దలcచినవారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా.
పురుషులకును వేఱెపదవి పుట్టుటయేమో
హరి మిము దలcచినవారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా.
ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా.
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా.
ఏ తండ్రి కనకకశ్యపు
ఘాతకుcడై యతని సుతుని కతుణను గాచెనె
బ్రీతి సురకోటి గొబడcఘ
నా తండ్రి నిన్ను నేను నమ్మితి కృష్ణా.
ఘాతకుcడై యతని సుతుని కతుణను గాచెనె
బ్రీతి సురకోటి గొబడcఘ
నా తండ్రి నిన్ను నేను నమ్మితి కృష్ణా.
ఓ పుండరీక లోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పురసంహార మిత్రుcడ
యో పుణ్యుcడ నన్ను బ్రోవు మోహరి కృష్ణా.
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పురసంహార మిత్రుcడ
యో పుణ్యుcడ నన్ను బ్రోవు మోహరి కృష్ణా.
ఏ విభుcడు ఘోరరణమున
రావణు వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు
నావిభు నే దలcతు మదిని నచ్యుత కృష్ణా.
రావణు వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు
నావిభు నే దలcతు మదిని నచ్యుత కృష్ణా.
గ్రహభయ దోషము లొందవు
బహుపీడలు చేర వెఱుచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహ తహ లెక్కడివి నిన్ను దలcచిన కృష్ణా.
బహుపీడలు చేర వెఱుచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహ తహ లెక్కడివి నిన్ను దలcచిన కృష్ణా.
గంగ మొదలైన నదులను
మమళముగ జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలcచు సాటిరావుర కృష్ణా.
మమళముగ జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలcచు సాటిరావుర కృష్ణా.
ఆ దండకా వనంబున
కోదండము దాల్చినట్టి కోమలమూర్తి
నాదండc గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేలుప కృష్ణా. 80
కోదండము దాల్చినట్టి కోమలమూర్తి
నాదండc గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేలుప కృష్ణా. 80
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా
పాపము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మునాcడ సిద్దము కృష్ణా.
పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా
పాపము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మునాcడ సిద్దము కృష్ణా.
నీనామము భవహరణము
నీ నామము సర్వసౌఖనివహకరంబు
న్నీ నామ మమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా.
నీ నామము సర్వసౌఖనివహకరంబు
న్నీ నామ మమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా.
పరులను నడిగిన జనులకు
కురచసుమీ యిదియటంచు గుఱుతుగ నీవు
న్గురుచcడవై వేడితి మును
ధర బాదత్రయము బలిని తద్దయు కృష్ణా.
కురచసుమీ యిదియటంచు గుఱుతుగ నీవు
న్గురుచcడవై వేడితి మును
ధర బాదత్రయము బలిని తద్దయు కృష్ణా.
పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుcడవా బ్రహ్మగన్న ప్రభుcడవు కృష్ణా.
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుcడవా బ్రహ్మగన్న ప్రభుcడవు కృష్ణా.
రఘునాయక నీ నామము
లఘుపతితో దలcచగలనె లక్ష్మీరమణా
యఘములు బాపుడు దయతో
రఘురాముcడవైన లోకరక్షక కృష్ణా.
లఘుపతితో దలcచగలనె లక్ష్మీరమణా
యఘములు బాపుడు దయతో
రఘురాముcడవైన లోకరక్షక కృష్ణా.
అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు ననుభవశాలీ
యప్పాలను గనుగొనవే
యప్పానను బ్రోవు వేంకటప్పా కృష్ణా.
నప్పాలను నతిరసంబు ననుభవశాలీ
యప్పాలను గనుగొనవే
యప్పానను బ్రోవు వేంకటప్పా కృష్ణా.
కొంచెపు వాcడని మదిలో
నెంచకుమీ వాసుదేవ గోవిందహరీ
యంచితముగ నీ కరుణకు
గొంచెము నధికంబు గలదె కొంకయు కృష్ణా.
నెంచకుమీ వాసుదేవ గోవిందహరీ
యంచితముగ నీ కరుణకు
గొంచెము నధికంబు గలదె కొంకయు కృష్ణా.
వావిరి నీ భక్తులకుం
గావరమున నెగ్గుసేయు గర్వాంధుల మున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా.
గావరమున నెగ్గుసేయు గర్వాంధుల మున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా.
అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలcపనేరను
కుయ్యాలింపుము మహత్మ గుఱుతుగ కృష్ణా.
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలcపనేరను
కుయ్యాలింపుము మహత్మ గుఱుతుగ కృష్ణా.
కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా. 90
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా. 90
యమునికి నికcనే నెఱవను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమరcగ దలcచెదను వేగ ననిశము కృష్ణా.
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమరcగ దలcచెదను వేగ ననిశము కృష్ణా.
దండమయా విశ్వంభర
దండమయా పుండరీక దళనేత్రహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా.
దండమయా పుండరీక దళనేత్రహరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా.
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా.
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా.
తిరుమణి దురిత విదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుcజుడు
పరమణిపవిత్రుండు భాగ్యవంతుcడు కృష్ణా.
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుcజుడు
పరమణిపవిత్రుండు భాగ్యవంతుcడు కృష్ణా.
సర్వేశ్వర చక్రాయుధ
శర్వాణివినుతనామ జగదభిరామా
నిఎవాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణా.
శర్వాణివినుతనామ జగదభిరామా
నిఎవాణనాధ మాధవ
సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణా.
శ్రీ లక్ష్మీనారాయణ
వాలాయము నిన్ను దలcతు పందితచరణా
ఏలుము నను నీ బంటుగ
చాలగ నిను నమ్మినాను సరసుcడ కృష్ణా.
వాలాయము నిన్ను దలcతు పందితచరణా
ఏలుము నను నీ బంటుగ
చాలగ నిను నమ్మినాను సరసుcడ కృష్ణా.
శ్రీధర మాధవ యచ్యుత
భూదర పురుహుతవినుత పురుషోత్తమ ఏ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాcడ ముద్దుల కృష్ణా.
భూదర పురుహుతవినుత పురుషోత్తమ ఏ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో నమ్మినాcడ ముద్దుల కృష్ణా.
శిరమున తర్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక అమరcదాల్తువు శ్రీహరి కృష్ణా.
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపు పతకము
సిరినాయక అమరcదాల్తువు శ్రీహరి కృష్ణా.
అందెలు పాదములందున
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా.
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర ముని సన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా.
కందర్పకోటి సుందర
మందరధర నామతేజ మధుసూదన యో
సుందరవిగ్రహ మునిగణ
వందిత మిము దలcతు భక్తవత్సల కృష్ణా.
మందరధర నామతేజ మధుసూదన యో
సుందరవిగ్రహ మునిగణ
వందిత మిము దలcతు భక్తవత్సల కృష్ణా.
అనుదినము కృష్ణశతకము
వినిన పథించినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గో గణములు
తనయులు నభివృద్ధిపొందు తద్దయు కృష్ణా. 101
వినిన పథించినను ముక్తి వేడుక గలుగున్
ధనధాన్యము గో గణములు
తనయులు నభివృద్ధిపొందు తద్దయు కృష్ణా. 101